Logo
Date of Publish : 06 October 2021, 4:27 pm
Editor : Sake Naresh

పెన్షన్ వ్యవహారములో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలసి వినతి పత్రం అందించిన జనసేన నేత డాక్టర్ యుగంధర్ పొన్న

సుప్రీంకోర్టు ఆదేశాలను అణగ దొక్కుతున్న అధికారులు :

స్థానిక స్వపరిపాలన వ్యవస్థ దిగజారుతున్న వైనం:

ప్రజా పాలన అంటే ప్రజలకు అన్యాయం చేయడమా!

పంచాయతీ కార్యదర్శిని ఎస్ గోపిని వెంటనే సస్పెండ్ చేయాలి:

జనసేన నేత డాక్టర్ యుగంధర్ పొన్న

    కార్వేటినగరం, (జనస్వరం) : కార్వేటినగరం మండలం ఆర్ కె వి బి పేట గ్రామపంచాయతీ, ఇందిరా కాలనీ వాస్తవ్యులు పి సంపూర్ణయ్యకు గత సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో ఐ డి నెంబర్ 848777162 లో పెన్షన్ ఇచ్చారు. ఈ డబ్బు స్థానిక పంచాయతీ కార్యదర్శి జీతం నుంచి మూడు నెలలు ఇవ్వడం జరిగింది. తన తప్పు లేకపోతే అర్హుడైన సంపూర్ణయ్యకు ఎందుకు ఇచ్చారు? తన సొంత డబ్బులు ఇవ్వవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అర్హుడైన సంపూర్ణయ్యకు ఎందుకు పెన్షన్ ఆపారు? ఈ విషయమై జనసేన పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్  డాక్టర్ యుగంధర్ పొన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలసి వినతి పత్రం అందించారు. గతంలో ఇదే విషయమై పది సార్లు గ్రామస్తులు పది సార్లు కలిసి వినతి పత్రం సమర్పించారు. అయినా కూడా ఎటువంటి స్పందన లేదు. స్పందనకు కూడా సమాధానం లేదు. స్పందన లేని ఈ స్పందన కార్యక్రమాలు ఎందుకు? ఎవరిని ఉద్ధరించడానికని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారకులైన విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి ఎస్ గోపిని విధుల నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అధికారులు అనగా తొక్కుతున్నారని, స్థానిక స్వపరిపాలన వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా అధికారులు పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన అంటే ప్రజలకు అన్యాయం చేయడమా అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఉసురు పాటి విజయ్, నియోజకవర్గ సమన్వయకర్త మెదవాడ రాఘవ తదితురులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com