
ఉరవకొండ ( జనస్వరం ) : తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నెరిమెట్ల గ్రామానికి చెందిన పర్వతయ్య అనే వ్యక్తి కుటుంబానికి ఉరవకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బోయ చంద్రశేఖర్ 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కరోనా కష్టకాలంలో జనసేనపార్టీ తరుపున అనేక సేవా కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో నెరిమెట్ల గ్రామ యువత పాల్గొన్నారు.