పత్తికొండ : గ్రామాల్లో పర్యటిస్తున్న జనసేన నాయకుడు C రాజశేఖర్

పత్తికొండ

            పత్తికొండ ( జనస్వరం ) :  జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు C రాజశేఖర్ ప్రజా పోరాట యాత్ర కొనసాగించడం జరిగింది. అందులో భాగంగా  గూడెంపాడు, కమలపాడు, పెనమాడ, ఎరుకల చెరువు, ఆగవేలి, పోతుగల్, జి మల్లాపురం గ్రామాలలో పర్యటించడం జరిగింది. రాజశేఖర్ మాట్లాడుతూ పెనుమాడా గ్రామంలో నాడు నేడు కింద ఎన్నో గ్రామాలు స్కూళ్ళు అభివృద్ధి చెందనప్పటికీ పెనమాడ గ్రామంలో మాత్రం స్కూల్ దారుణంగా ఉందని అన్నారు. స్కూల్లోపాఠాలు భోదించాల్సిన ఉపాధ్యాయులు  పిల్లలని ఎండలో కూర్చోపెట్టి పాఠాలు చెబుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. స్కూలు మొత్తం పరిశీలించగా పై పెచ్చులు ఊడి, ఎప్పుడు కూలుతుందో అనే పరిస్థితిలో ఉందని అన్నారు.  అదే విధంగా అదే గ్రామంలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజ్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంగన్ వాడి కేంద్రం కూడా లేదు.  ఎరుకల చెరువులో బస్సు సౌకర్యం  మరియు నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పోతుగల్ లో సీసీ రోడ్లు లేక డ్రైనేజ్ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గుండ్ల మల్కాపురంలో ప్రస్తుత జెడ్పీటీసీ గ్రామంలో సీసీ రోడ్లు లేక కొత్త ఇల్లు ఇక్కడ ఎవరికి చేపట్టలేదని మా దృష్టికి వచ్చిందన్నారు. ఒక ఇల్లు కూడా మంజూరు చేయని పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం అన్నారు. ఆగవెళ్ళి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనజీ లేకపోవటం వలన  ఊరి నడిబొడ్డున మురికి నీరు నిలిచిన దృశ్యాలు చూసి మేము ఆశ్చర్యపోయామని అన్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యలను పరిష్కరించాలని  కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  జనసేన నాయకులు మహేంద్ర, దుర్గ, ఎర్రి స్వామి, అభిరామ్, నాయుడు, లింగడు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way