
ఒంగోలు ( జనస్వరం ) : ఉమ్మడి ప్రకాశం జిల్లా, పర్చూరులో జరిగిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ప్రమాదానికి గురైన బాధితుడు బాలు ను పర్చూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆలా అనిల్ కుమార్ పరామర్శించారు. ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం 20 వేల రూపాయలు సాయం అందించారు. అనంతరం హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి వెంటనే ఆపరేషన్ కు సమాయత్తం చేయమని కోరగా, వైద్యులు శనివారం చేస్తాం అనడం జరిగిందని చెప్పారు. అయితే శనివారం నాడు జరిగే ఆపరేషన్ ఖర్చులకు కూడా తాను పూర్తి బాధ్యత వహిస్తానని, బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడం జరిగింది. అలాగే బాధితుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించడం జరిగింది.