Logo
Date of Publish : 17 May 2022, 5:52 pm
Editor : Sake Naresh

ఎస్.కోటలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల

            ఎస్.కోట ( జనస్వరం ) : కష్టాల్లో ఉన్నవారి కోసం సొంత డబ్బులు ఖర్చు చేస్తున్న గొప్ప నాయకుడు పవన్ కల్యాణ్ అని జనసేన పార్టీ నాయకులు గొరపల్లి చినబాబు, గొరపల్లి రవికుమార్ పేర్కొన్నారు. రాజకీయాల్లో అవినీతి రాజ్యమేలుతున్న ఈరోజుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు ఉండడం అరుదైన విషయమన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రకు మద్ధతుగా టీం పిడికిలి వారు రూపొందించిన వాల్ పోస్టర్లను ఎస్.కోట జనసైనికులు ఆదివారం ఆవిష్కరించారు. కొత్తవలస జంక్షన్ లో పార్టీ నాయకులు, జనసైనికులు కలిసి పోస్టర్లను ఆటోలకు, దుకాణాలకు అతికించారు. ఈ సందర్భంగా గొరపల్లి రవికుమార్, గొరపల్లి చినబాబు మాట్లాడుతూ కౌలు రైతులకు మద్ధతుగా పవన్ కల్యాణ్ ఇటువంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమన్నారు. 3000 మంది రైతులకు 30 కోట్ల రూపాయలు అందిస్తున్నారని తెలిపారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి, వివేకంతో జనసేన పార్టీకి మద్ధతు తెలపాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతులకు అండగా పవన్ కల్యాణ్ చేపట్టిన ఈ కార్యక్రమం గురించి జనసైనికులు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మల్లువలస శ్రీను, కొత్తవలస ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన నక్కరాజు సతీష్, నాయకులు పిల్లా రామదుర్గ, శ్రీనివాస రాజు, ముచ్చకర్ల శ్రీను, గొర్లె శ్రీనివాసరావు, ఇరోతి రమణ, ఉగ్గిన చిన్నారావు, ముమ్మన రమణ, కరెడ్ల రామకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.*


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com