సీతంపేట ( జనస్వరం ) : జిల్లా పాలకొండ నియోజకవర్గo జనసేన పార్టీ నాయకులు, టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ మత్స.పుండరీకం మాట్లాడుతూ నేడు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వo రైతు వ్యతిరేక విధానాల కారణంగా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా నిపేందుకు రూ. 30 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకటించిందన్నారు. ప్రతి జిల్లాలో తిరుగుతూ ఆ కుటుంబాల యోగ క్షేమాలు తెలుసుకుంటూ, ధైర్యం నింపుతూ ఒక లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం చేస్తూ 3000 వేల మంది కౌలురైతుల కుటుంబాలకు అండగా పవన్ కళ్యాణ్ గారు నిలుస్తున్నారన్నారు. నిత్యం ప్రజా క్షేమం కాంక్షించే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదన్నారు. అస్తవ్యస్త పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. ముఖ్యమంత్రి తమ పార్టీ ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లమంటే ప్రజలడిగే ప్రశ్నలకు బదులివ్వలేక బయటకు వచ్చిన పది మంది ఎమ్మెల్యేలు కూడా పారిపోయారు. ఇంకొందరు సాకులు చెప్పుకుంటూ కార్యక్రమాన్ని వాయిదా వేసుకుంటున్నారు. గడప గడపకు వెళ్తే జనాగ్రహానికి ఎక్కడ బలైపోవాల్సి వస్తుందోనన్న భయంతోనే వీరు ప్రజలకు ముఖం చాటేస్తున్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల్లో చిక్కుకొంది అన్నారు. జనసైనికులతో మత్సపుండరీకం జై జవాన్ జై కిసాన్ జై పవన్ జై జనసేన అన్న నినాదాలు ఇచ్చారు. అనంతరం టీమ్ పిడికిలి పోస్టర్లు ను ఆటోలకు, గోడలకు అతికిoచారు. ఈ కార్యక్రమంలో కిరణ్, విశ్వనాధo, గంగరాజు, బి. పి నాయుడు, కంటు మురళి, కర్ణేన సాయి పవన్, కలిపిల్లి సింహాచలం, తదితరులు పాల్గొన్నారు.