Logo
Date of Publish : 28 June 2022, 5:14 pm
Editor : Sake Naresh

కదిరిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్స్ విడుదల

            కదిరి ( జనస్వరం ) : కదిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు కూటాల లక్ష్మన్న మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా 3000 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతుల కుటుంబాలకి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నారన్నారు. రైతులు, నిరుద్యోగులు రాష్ట్ర ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పోరాటం చేస్తుంటే ప్రజల్లో పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు అంటూ, సహాయం పొందుతున్న వారిని రైతులే కాదు అంటూ విమర్శ చేస్తున్నారు. మూడు సంవత్సరాల కాలంలో ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది. వీరా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పార్టీ నాయకుడి జగన్ రెడ్డికి ఆత్మహత్య చేసుకున్న వారు రైతులు కాదు అని నిరూపించే దమ్ముందా అని నిలదీశారు?  మిమ్మల్ని CBI దత్త పుత్రుడు అని నిరూపించే ధైర్యం మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఉందన్నారు. ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టాల్సిన ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడ చూసినా రహదారులు మొత్తం గుంతలమయం అయ్యాయి. ఇంతవరకు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ సమస్యను పెంచుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు ప్రతి ఏటా 15000 రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి కేవలం 13500 రూపాయలు మాత్రమే. అందులోనూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6000 రూపాయలతో కలిపి కేవలం రైతుల ఖాతాల్లో 13500₹ రూపాయలు మాత్రమే జమ చేస్తోంది. చెత్తపై పన్ను, ఇంటిపై వేస్తూ పేద మధ్య తరగతి ప్రజలపై అధిక ధరల పేరుతో భారం మోపుతోంది. ఈ ప్రభుత్వ నిరంకుశ పాలన వల్ల ప్రజలు విసుగుచెంది జన సేన పార్టీపై వస్తున్న ఆదరణను ఓర్వలేకే ఈ ఫ్రస్ట్రేషన్ ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ది చెప్పడం కోసం మీ అధికార గర్వాన్ని దించడం కోసం సిద్దంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు పాల్గొనటం జరిగింది. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com