గత 16 నెలల నుంచి రాష్ట్ర ప్రజలు కరోనాతో ఎటువంటి ఆర్థిక వనరులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపై, చెత్తపై పన్నులు పెంచడం చాలా దారుణమైన విషయం. దీనివలన బాడుగలు పెరిగి అవి కట్టలేక ఆర్థికంగా ఇబ్బంది పడతారని కదిరి జనసేన పార్టీ ఇంఛార్జ్ భైరవ ప్రసాద్ గారు తెలియజేశారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పన్నులను పెంచి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఆస్తిపన్ను పెంపుదలను నిలిపివేయాలని లేనిపక్షంలో ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత మరియు ఆందోళనలు తప్పవని తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com