• ప్రజలతో మమేకమవుతున్న TC. వరుణ్
• పూలమాలలు వేసి హారతులు పడుతున్న బిందెల కాలనీ మహిళలు
• మూడేళ్ల చిన్నారి ఆరోగ్యానికి నాది భరోసా అని హామీ
• తల్లిదండ్రుల వేదనకు చలించిపోయిన టి.సి.వరుణ్
అనంతపురం, (జనస్వరం) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను వివరిస్తూ జనసేన పార్టీని గెలిపించాలని కోరుతూ జనసేన జిల్లా అధ్యక్షులు మరియు అనంతపురము అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ నిర్వహిస్తున్న జనసేన జయభేరి కార్యక్రమం అటహాసంగా సాగుతోంది. ఆదివారం నగరంలోని 2వ డివిజన్ బిందెల కాలనీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టి.సి.వరుణ్ స్థానిక ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. కాలనీ ప్రజలు టి.సి.వరుణ్ కి పూలమాలలు వేసి స్వాగతం పలకగా.. మహిళలు, యువతులు హారతులు పట్టారు. కాలనీలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ జనసేన పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే తమ మూడేళ్ల చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తల్లిదండ్రులు టీ.సీ.వరుణ్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చలించిపోయిన టీ.సీ.వరుణ్ చిన్నారి ఆరోగ్యానికి నాది భరోసా అంటూ వైద్యం చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎక్కడికక్కడ సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కష్టాలను వింటూ మీకు జనసేన అండగా ఉంటుంది. మీ సోదరుడిగా తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని వరుణ్ కాలనీ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిలు కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శిలు కిరణ్ కుమార్, ముప్పూరి కృష్ణ, నగర ఉపాధ్యక్షులు జక్కిరెడ్డి ఆదినారాయణ, నగర ప్రధాన కార్యదర్శిలు రొల్ల భాస్కర్, హుస్సేన్, కార్యదర్శులు వడ్డే వెంకటేష్, నెట్టిగంటి హరీష్, మరియు నాయకులు మేదర్ వెంకటేష్, రహీం భాష, హిద్దు, నజీమ్, నౌషాద్, సల్మాన్, పిల్లమరి శీన, మరియు వీరమహిళలు మంజుల, డోనే సరిత తదితరులు పాల్గొనడం జరిగింది.