నెల్లిమర్ల ( జనస్వరం ) : జనసేన పార్టీ ఇన్చార్జ్ లోకం మాధవి గారు భోగాపురం మండలం గాలి పేట గ్రామాన్ని సందర్శించి అక్కడి గ్రామ పెద్దలు మహిళలను కలిసి జనసేన పార్టీ సిద్ధాంతాలను వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రభుత్వ కక్ష్యపూరిత రాజకీయాలను అడ్డుకోవలంటే ప్రజలే బుద్ధి చెప్పగలరని మీరు వేసే ఓటు వృధాగా ఇటువంటి అరాచక ప్రభుత్వానికి అసలే వేయొద్దని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగ పని తీరు అసలేమీ బాగాలేదు అర్హులైన లభ్డిదారులకు పథకాలు చేరటం లేదు. వృద్దులకు మరియు వితంతువులకు పెన్షన్లు రావటం లేదు. మెరుగైన పరిపాలన,సామాజిక న్యాయం జనసేన తోనే సాధ్యం అని, ప్రతీ ఒక్క కుటుంబాన్ని నా కుటుంబ సభ్యులుగా భావిస్తూ నిష్పక్షపాతంగా నేను సేవ చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటును జనసేన పార్టీ గుర్తయిన గాజు గ్లాసు గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com