విజయవాడ, (జనస్వరం) : స్థానిక జనసేన పార్టీ 47 డివిజన్ కార్యాలయంలో బుధవారం అయ్యప్ప స్వామి పుట్టినరోజు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ పుట్టినరోజు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన సైనికుడు చెలపాగా సురేష్ డూండీ 2000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు గౌరీ శంకర్ మాట్లాడుతూ కుల, మతాలను ఓకే తాటి పైకి తీసుకు వచ్చేందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి ఆదర్శప్రాయమని అన్నారు. అయన ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రజలందరూ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకి రావాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో మంతపురం రాజేష్, ముద్దాన రామారావు, పడాల రాంబాబు, బసవ నరేష్, ముత్యాలు, దుర్గారావు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com