
ఎమ్మిగనూరు, (జనస్వరం) : ఎమ్మిగనూరు మండలం బనవాసి గ్రామంలో జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్ లు రైతు భరోసా యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది కౌలు రైతులు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనాని పవన్ కళ్యాణ్ చేస్తున్నా రైతు భరోసా యాత్రని స్పూర్తిగా తీసుకొని సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి కౌలురైతులందరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్, మధు, అజయ్ తదితరులు పాల్గొన్నారు.