Logo
Date of Publish : 18 September 2020, 11:49 am
Editor : Sake Naresh

ప్రజాసేవే జనసేన లక్ష్యం – 3 ఆక్సిజన్ సిలెండర్లు పంపిణీ : జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ప్రజాసేవే జనసేన లక్ష్యం - 3 ఆక్సిజన్ సిలెండర్లు పంపిణీ :  జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

            ప్రజలకు సేవ చేయడమే జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో కోవిడ్ కేంద్రాలలో ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగరంలోని సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో నడుస్తున్న జయ భారత్ ట్రస్ట్ హాస్పిటల్ లోని కరోనా రోగుల కోసం మూడు ఆక్సిజన్ సిలిండర్ లను అందజేశారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి మాట్లాడుతూ ఎక్కడ ఆకలి ఉంటుందో, ఎక్కడ ప్రజలకు సమస్య ఉంటుందో, అక్కడ జనసేన పార్టీ ప్రత్యక్షం అవుతుందని అన్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో 700కు పైగా ఆక్సిజన్ సిలిండర్లను, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 30 సిలిండర్లను అందచేసాం అని ఆయన తెలియచేసారు. జయభారత్ హస్పిటల్ జనరల్ మేనేజర్ డా"గురు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా జనసేన నాయకులు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. కరోనా రోగుల కోసం ఆక్సిజన్ సిలిండర్లు అందచేసినందుకు జనసేన పార్టీకి ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పావుజెన్ని చంద్ర శేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, హాస్పిటల్ డిప్యూటీ మేనేజర్ కృష్ణా రెడ్డి, వెంకటేష్, హేమంత్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com