సింగనమల ( జనస్వరం ) : జగనన్నా కాలనీలపై మాట్లాడే అర్హత, హక్కు ఒక్క జనసేన పార్టీ కి మాత్రమే ఉందని సింగనమల జనసేన నాయకులు పత్రికా ముఖంగా తెలిపారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ కల్పన పథకం కింద సొంత పార్టీ కార్యకర్తలకు తప్ప నిజమైన లబ్ది దారులకు చేసింది శూన్యమని అన్నారు. ప్రభుత్వ సలహాదారుడు, స్థానిక ఎమ్మెల్యే భర్త సాంబశివ రెడ్డి గారిని జనసేన పార్టీ తరుపున ఒకటే అడుగుతున్నామని అన్నారు. శింగనమల నియోజకవర్గం అంటే కేవలం బుక్కరాయసముద్రం ఒక్కటేనా? మిగిలిన 5 మండలాల పరిస్థితి ఏంటి? నార్పల మండలంలో పట్టాలు పంపిణి చేసి దాదాపు 2 సం. గడుస్తున్నా నవరత్నాల్లో ఒక రత్నం (జగనన్న ఇల్లు ) కనుమరుగై పోయినదన్నారు. లబ్దిదారులు అద్దెలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు. అప్పో సప్పో చేసుకొని ఇల్లు నిర్మించుకుందామన్న అధికారులు అనుమతి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. అంతే కాక జగనన్న కాలనీల్లో ఎక్కడ మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు, ప్రభుత్వం గోరంగా విఫలమైనదని స్వష్టంగా కనిపిస్తోంది. జనసేనపార్టీ మండల పరిధిలోని జగనన్న కాలనీల్లో సందర్శించి మాత్రమే ఆరోపణలు చేస్తున్నాము. మా ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాడనికి మేము సిద్ధం మీరు సిద్ధమా ..? జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే సమస్యలు పరిష్కారం కావు, ప్రభుత్వం చిత్త శుద్దితో లబ్దిదారులకు సాధ్యమైనంత తొంగరగా నాణ్యతతో ఇల్లును నిర్మించి అందించాలని బడుగుబలహీన వర్గాల తరుపున జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో శివ యాదవ్, నాగేంద్ర, పొన్నతోట రామయ్య జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com