Search
Close this search box.
Search
Close this search box.

కాలువ లేనందున ఇబ్బంది పడుతున్న గృహస్తులుకు బాసటగా నిలబడి పోరాటం చేస్తున్న జనసేన

జనసేన

        పార్వతీపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు గర్భాన. సత్తిబాబు, మరియు కూరంగి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మురికి కాలువ సమస్య పై పాలకొండ మండలం వడమ కాలనీ లో చెరువుకు అనుకొని తూర్పు భాగంలో ఉన్న 7వ వార్డులో బలివాడ.సాయి ఇంటి దగ్గర నుండి నివసిస్తున్న గృహస్థుల ఇండ్ల నుండి వచ్చే మురికి నీరు, వర్షం నీరు మరియు డ్రైనేజ్ వాటర్ పోయేందుకు “కాలువ” లేని కారణంగా అక్కడ మురికి నీరు నిలవగా ఉండిపోవడంతో ఆ వీధిలో, ఉన్న ప్రజలు టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, ఇలా రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. దోమల సమస్య కూడా తీవ్రంగా ఉండటంతో ప్రజలకు అనారోగ్య పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. కావున ఇక్కడ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, స్థానిక ప్రజలతో మున్సిపల్ కమిషనర్ వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ వారు పరిశీలించి తగు చర్యలు వెంటనే తీసుకోవాలని సత్తిబాబు కోరారు. వెంటనే చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో, వారాడ గజేంద్ర నాయుడు, ద్వారపుడి ప్రసాద్, మిడితాన ప్రసాద్, వండాన సాయి, గర్భాపు నరేంద్ర, డొంపాక, సాయి, మాదాసు సంతోష్, సుబ్బు, మామిడి గజేంద్ర, బి భావాని, గెంబలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way