Logo
Date of Publish : 23 December 2023, 8:49 pm
Editor : Sake Naresh

మైనార్టీల అభివృద్ధికి జనసేన కట్టుబడి ఉంది : డాక్టర్ కందుల నాగరాజు

   విశాఖపట్నం ( జనస్వరం ) : మైనార్టీలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి పరిష్కరించేందుకు కృషి చేస్తానని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలోని పలువురు ముస్లిం మహిళలు ఆయన కార్యాలయంలో కలిసి తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూముస్లింల సంక్షేమానికి జనసేన పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింలకు కమ్యూనిటీ భవనాలు, షాదీఖానలు నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం ముస్లింలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే తెలిపారు. అధికారంలోకి వచ్చాక మైనారిటీ ల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. తాము అధికారంలోకి రావడానికి సాధ్యం కాని హామీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను వైసిపి మోసం చేసిందన్నారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా అదికార మార్పిడి జరుగుతుందన్నారు. మైనారిటీ ల సమస్యలను పరిష్కరించేందుకు తాను కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ముస్లిం మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com