Logo
Date of Publish : 18 December 2021, 1:50 pm
Editor : Sake Naresh

అమరావతికే జనసేన కట్టుబడి ఉంది : రైతుల సభలో చిత్తూరు జిల్లా జనసేన నాయకులు

    తిరుపతి, (జనస్వరం) : తిరుపతిలో నిర్వహించిన అమరావతి రైతుల మహాసభలో జనసేన పార్టీ నాయకులు పిఏసి సభ్యులు డా పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, రాయలసీమ కో కన్వీనర్ రాందాస్ చౌదరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని రైతుల కోసం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే మాటకు ఆరోజు కట్టుబడి ఉన్నారు. ఈరోజు కట్టుబడి ఉన్నారు. ఆయన రైతుల పక్షపాతి, గత ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములు లాకుంటున్న సమయంలో రైతులు ఇస్తే తీసుకోవాలే తప్ప బలవంతపు చర్యలకు పాల్పడవద్దు అని ఆరోజు తీవ్రంగా ఖండించారు. అదే విధంగా ప్రస్తుతం కొనసాగుతున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలను రైతులను మూడు రాజధానులు అంటూ మోసం చేస్తున్నారు అని దీనికి పవన్ కళ్యాణ్ కల్యాణ్ గారు పూర్తి వ్యతిరేకమని అమరావతి రైతులకు మద్దతుగా ఈ రోజు మేము హాజరయ్యాము అని, అమరావతే రాజధానిగా ఉంటుందని జనసేన పార్టీ తరపున మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడకు వచ్చి జనసేన తరపున మా పూర్తి మద్దతు తెలియజేయడం జరిగిందని అన్నారు. రాందాస్ చౌదరి మాట్లాడుతూ అమరావతి పరిరక్షణ మహోద్యమ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు సందేశము పంపారని జనసేన ప్రతినిధిగా మేము హాజరయ్యమని, అమరావతే రాజధానిగా ఉంటుందని అన్నారు. రైతుల పక్షాన జనసేన పార్టీ ఉంటుందని స్పష్టం చేసారు. రైతుల పాదయాత్ర జనం మదిలో నిలిచిపోతుందన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com