Logo
Date of Publish : 10 April 2021, 11:22 pm
Editor : Sake Naresh

తిరుపతిలో జనసేన – బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాధికారంలో సామాజిక న్యాయం – అణగారిన వర్గాల సమావేశము

                   తిరుపతి ఉప ఎన్నికల్లో భాగంగా జనసేన - బీజేపీ పార్టీలు సంయుక్తంగా రాజ్యాధికారంలో సామాజిక న్యాయం - అణగారిన వర్గాల సమావేశము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు గారు మాట్లాడుతూ అణగారిన వెనుకబడిన సామాజిక వర్గాలకు బిజెపి, జనసేన పార్టీలు ప్రాధాన్యత ఇస్తుందిని అన్నారు. ఒక ఛాయ్ వాల మోడీని ప్రధాని చేయడం, అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడం, ఇప్పుడు ఒక వెనుకబడిన కులానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారిని రత్నప్రభకి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ఒక బీజేపీ పార్టీకే సాధ్యం అయిందన్నారు.  ఇదే బిజెపి విధానం బీజేపీ అధికారంలో ఉన్న దేశంలోని అన్ని ప్రాంతాలలో ఇదే విధానం కొనసాగుతూ ఉందన్నారు. తిరుపతి ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి ఎంపీగా గెలుపొందిన ఈ ప్రాంతంలోనే కాక రాష్ట్రమంతటా కూడా ఇదే విధానం అమలులో ఉంటుంది. వెనుకబడిన అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం వారిని ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడం మా లక్ష్యం అన్నారు. దేశ ప్రజలకు సోషల్ ఈక్వాలిటీ ఇచ్చే ఏకైక పార్టీ అని అన్నారు. ' sabka saath sabka vikas' నినాదానికి అర్థం ప్రతి ఒక్కరికీ సామాజిక సమానత్వం కల్పించడం, ఈ విధానానికి బిజెపి కట్టుబడి ఉంటుందని, ప్రజలకు సమానత్వం కల్పిస్తుందన్నారు.  ఇటీవల బిజెపి కార్యకర్త స్వామి పరిపూర్ణానంద స్వామి చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ తిరుమల కొండ పైన ఉన్న వెంకన్నకు ఫ్యాను అవసరం లేదు ,సైకిలు అసలే అవసరంలేదు, ఆయనకు లక్ష్మీదేవి నివాసమైన కమలం కావాలని చెప్పిన మాటలను గుర్తు చేశారు. భారతదేశంలో బిజెపి ఆవిర్భవించిన తొలి రోజులలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇది మత పార్టీ కొత్త పార్టీ, ఇతర మతాలకు ఇక్కడ సమానత్వం ఇవ్వలేరు అని అని ప్రచారం చేశారు. ఈ చెడు ప్రచారాలకు విరుద్ధంగా బిజెపి సర్వమత సమానత్వం, సకల జనుల సమానత్వం పాల ద్వారా ప్రజలకు తెలియజేస్తోందన్నారు. బిజెపి జాతి కోసం ఆవిర్భవించిన పార్టీ, జాతి అంటే సకల జనుల సమానత్వమే. ఇటువంటి పార్టీని అంతమొందించాలని ఈ పార్టీ ఆవిర్భావం నాడే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కానీ ఆనాడు నాయకుల త్యాగనిరతి నిరాడంబరత విశాల దృక్పథం పార్టీని ఈనాడు దేశవ్యాప్తంగా విస్తరించేలా చేసింది. తిరుపతి ఉప ఎన్నికలలో మాజీ ఐఏఎస్ అధికారిని పాలనా రంగంలో విశేష అనుభవం గల వ్యక్తి రత్నప్రభ ఎంపీగా గెలిపించండి అది తిరుపతి అభివృద్ధికే కాక యావత్ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com