నెల్లూరు ( జనస్వరం ) : అంగన్వాడి కార్యకర్తలు విధులకు హాజరు కాకపోతే తాళాలు సచివాలయం సిబ్బంది చేత పగలగొట్టి పనులు చేయిస్తున్న జగన్. సమ్మె చేస్తున్న మున్సిపల్ కార్మికులు కాలవలు కూడా మీరు క్లీన్ చేయాల్సింది ఉంది అని ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంగన్వాడి కార్యకర్తలకు మద్దతుగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జిల్లా ఉపాధ్యక్షుడు బద్దెపూడి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పది రోజులుగా న్యాయమైన కోరికలు తీర్చాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు నిరసనలు తెలుపుతుంటే నిమ్మకు నీరెట్టినట్లుంది ఉంది ఈ ప్రభుత్వం. అధికారం లోకి రావడం కోసం కల్లబొల్లి మాటలు చెప్పి పక్క రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తాను అన్న జగన్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా తక్కువ వేతనానికి పనిచేయించుకుంటుంది. పక్క రాష్ట్రాల్లో 14,500 ఉంటే ఇక్కడ 11,000 మాత్రమే ఉంది. పక్క రాష్ట్రంలో అధికారం మారిన ప్రభుత్వం త్వరలో 18000 చేసే ప్రయత్నంలో ఉంటే మన జగనన్న ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదు. ఇంట్లో ఒక చిన్న బిడ్డ, పురిటి తల్లో ,వృద్ధురాలు ఉంటే ఎంత కష్టమో అటువంటిది అంగన్వాడి అక్క చెల్లెలు ఇంటిలోని పనులన్నీ పూర్తి చేసుకొని ఎంతోమంది శిశువులలో కడుపుతో ఉన్న మహిళలకు సేవ చేస్తూఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. గౌరవ వేతనం కాదు కనీసం వేతనం అమల్లోకి రావాలి..గ్రాట్యుటీ విషయంలో ప్రభుత్వం న్యాయంగా వ్యవహరించాలి అంటూ నిరసనలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు అండగా జనసేన పార్టీ నిలుస్తుంది అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచారు. 75 రోజులు ఎక్స్పైరీ డేట్ ఉన్న జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేసి ప్రజా ప్రభుత్వంలో మీ న్యాయమైన కోరికలు తీర్చేందుకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తారని తెలిపారు. సిఐటియు నాయకులు మరియు అంగన్వాడీ కార్యకర్తలతో జరిగిన ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుదీర్ బద్దిపూడి, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, వర్షన్, హేమచంద్ర యాదవ్, కేశవ్, కార్తీక్, వర తదితరులు పాల్గొన్నారు.