నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కౌన్సిల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని మాట ఇచ్చారు. అయితే అధికార పార్టీ నాయకులు మాట ఇచ్చి మడం తిప్పారని తమ పర్మినెంట్ విషయం ఏం చేశారు మేయరుగా ఎన్నికైనప్పుడు కూడా స్రవంతి మా తరుపున నిరసన తెలియజేయగా ఆ రోజు కూడా కార్మికులందరికీ పర్మినెంట్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. కానీ ఇప్పటివరకు చేసింది లేదు. ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని మాట ఇచ్చిన ప్రభుత్వం మాట నిలబెట్టు కోవాలంటూ నిరసనకు దిగారు. సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేస్తున్న కార్మిక నాయకులను చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
విషయం తెలుసుకున్న జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ కార్మికులకు అండగా న్యాయమైన కోరికలతో శాంతియుతంగా నిరసన చేస్తున్న నాయకుల అరెస్టు చేయడానికి ఖండిస్తూ మున్సిపల్ కార్పొరేషన్ వద్ద కార్మికుల తో బైఠాయించారు. మున్సిపల్ కమిషనర్, మేయర్ వచ్చి మౌలిక వసతులు కల్పించడం చనిపోయిన వారికి పరిహారం ఇవ్వడంలో మీకు న్యాయం చేస్తాం... పర్మనెంట్ చేయడం మటుకు మా మా పరిధిలో లేడు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యకి మేము వివరాలు తెలపగలమే కానీ రాష్ట్రం మొత్తం ఒకే నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకోవాల్సి ఉంది దానికి తగ్గట్టుగా మేము కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందిస్తాము నిరసన విరమించమని కోరారు. శాంతియుతంగా న్యాయమైన కోరికలతో పోరాడుతున్న సిఐటియు నాయకులని వదిలే వరకు కూడా ఈ గేటు వద్ద నుంచి పోయేది లేదని గునుకుల కిషోర్ మరియు కార్మికులు బైఠాయించారు. పోలీసులతో చర్చ అనంతరం సిఐటియు నాయకులు విడుదల చేసిన తర్వాత తదుపరి కార్యా చరణతో ముందుకు వెళ్తామంటూ సమావేశం తో నిరసన ముగించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన సిఐటియు నాయకులు శ్రీనివాసులుకు మద్దతుగా నిలిచిన జనసేన, సిపిఐ, సిపిఎం నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
న్యాయమైన తమ కోరికల కోసం పోరాడుతున్న నాయకులను విడుదల చేసేంతవరకు కూడా ఎండని సైతం లెక్క చేయకుండా నిలబడిన కార్మికులకు అభినందనలు తెలుపుతూ.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప మన హక్కుల కోసం పోరాటంలో తప్పులేదు మీ ఉద్యోగాల పెర్మనెంట్ విషయంలో అధిష్టానానికి సమాచారం అందిస్తాము. జనసేన పార్టీ కూడా మీకు మద్దతుగా నిలుస్తుందని తెలిపారు మాట తిప్పడం మడమ తిప్పడం అలవాటైన ఈ వైసిపి ప్రభుత్వం రానున్న రోజుల్లో కూడా కార్మికులకు చేసేదేమీ లేదు. మున్సిపల్ కార్మికుల యొక్క విశిష్టతను తెలుసుకొని వారి న్యాయమైన కోరికలు నెరవేర్చే వరకు కూడా మేము అండగా ఉంటామని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com