నెల్లూరు ( జనస్వరం ) : అంగన్ వాడీ వర్కర్స్, సిఐటియూ నాయకుల ఆద్వర్యంలో పిడి కార్యాలయం ఎదుట చేస్తున్న నిరవధిక సమ్మె కు మద్దతుగా జనసేన పార్టీ తరఫున జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పాల్గొన్నారు. అంగన్వాడీ తల్లుల న్యాయమైన కోరికలు తీరే వరకూ తోడుగా ఉండి వారి సమస్య ను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం అయ్యేవరకు కూడా తోడుగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్నికల ముందు అంగన్వాడి అక్క చెల్లెళ్లకు పక్క రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం ఇస్తానన్న జగన్ మాట తప్పడం అలవాటే కాబట్టి మరొకసారి మాట తప్పాడు. పక్క రాష్ట్రంలో ఇప్పటికే 14,500 ఇస్తుండగా మన రాష్ట్రంలో ఎటువంటి పెంపు లేకుండా 11500 మాత్రమే ఇస్తున్నారు. మొన్న అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా దాదాపుగా 18 వేల రూపాయలకు పెంచే ప్రయత్నంలో ఉన్నారు, అంగన్వాడి తల్లుల న్యాయమైన కోరిక గౌరవ వేతనాలు అక్కర్లేదు కనీస వేతనాలు ఇప్పించండి అని... రాత్రనకా పగలనకా సేవలు అందిస్తున్న వారితో కనీసం మాట్లాడడానికి కూడా ఆలోచిస్తున్న జగన్ ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యల్ని తిప్పి కొట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కనీసం 26 వేల రూపాయలు జీతం ఇవ్వాలని ఉండగా... కనీస వేతనాల అమలు సరా సరి కూడా కనీసం పక్క రాష్ట్రాలకి సమానంగా కూడా ఇవ్వలేని సీఎం మరొక ఛాన్స్ ఇవ్వకండి. రిటైర్మెంట్ పెన్షన్ పక్క రాష్ట్రాల్లో ఐదు లక్షల రూపాయలు ఉండగా మన రాష్ట్రంలో కేవలం 50వేల రూపాయలు మాత్రమే ఉన్న దౌర్భాగ్య పరిస్థితిని మెరుగుపరచాల్సిన అవసరం. అంగన్వాడి అక్క చెల్లెలు తెలిపినట్లుగా ఇంట్లో వయసు మళ్ళిన వృద్ధులు, వృద్ధ మహిళ కానీ,గర్భిణీ స్త్రీలు కానీ చిన్న పిల్లలను కానీ చూసుకోవడం ఎంత కష్టమో అట్లాంటిది అందరి ఇళ్లలోని వీరందరి ఓపికను పరీక్షించడం సబబు కాదు. ఇప్పటికైనా వారి న్యాయమైన కోరికలు తీర్చాల్సిన పరిస్థితి ఉంది చేస్తున్న న్యాయమైన దీక్షలకు మద్దతుగా జనసేన పార్టీ ఉంటుంది. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వారి న్యాయమైన కోర్టులు తీసుకువచ్చి వారి పరిష్కారం వరకు కూడా జనసేన అండగా ఉంటుంది అని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శితో పాటు సిఐటియు,సిపిఎం, సిపిఐ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com