నెల్లూరు ( జనస్వరం ) : అక్రమంగా జరుగుతున్న సైదాపురం మైనింగ్ ఆపమంటే అన్ని మైనింగ్ మైనింగ్ ఎండీఎల్ లోరెన్యువల్ క్యాన్సల్ చేశారు చిన్న తరహా వ్యాపారస్తులు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు వీటిని గమనించండి అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఈరోజు స్పందనలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలు గత ప్రభుత్వాలు నిర్మించిన వేలాది టిడ్కో ఇళ్లను కనీస వసతులు కల్పించకుండా మరుగున పడవేసి చోద్యం చూస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం. ఉన్నట్టుగా ఉండి పేదల మీద ఏదో ప్రేమ వచ్చినట్లు గత ప్రభుత్వాలు నిర్మించిన టిడ్కో హౌసెస్ పంచుతూ ఎలక్షన్ స్టంట్ లు చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఆ మౌలిక వసతుల కల్పన అసంపూర్ణమే. గత సంవత్సరం ఆగస్టులో కరెంట్ మీటర్ల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో నేలపై ఉన్న మీటర్ల డోర్ ఓపెన్ చేసి ఉండటంతో ఒక బిడ్డ కరెంట్ షాక్ తో మృతి చెందింది. వారికి ఇంకా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు బాధిత కుటుంబాన్ని ఆదుకోండి. అదేవిధంగా సైదాపురంలో అక్రమంగా మైనింగ్ జరుగుతుందని ప్రజాప్రతినిధుల పోరాటాలతో ఓవరాల్ గా మొత్తం మైనింగ్ వ్యవస్థనే ఇబ్బంది పెడుతూ ఎండియల్ రెన్యువల్స్ క్యాన్సిల్ చేశారు. చిన్న తరహా వ్యాపారస్తులు అనుమతులకు లోబడి చేస్తున్నవారు ఆర్దిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 లక్షల రూపాయలు ఇస్తే పెద్ద తరహా మైనింగ్ లారీలను వదిలేస్తున్నారు అంటూ ఫిర్యాదు ఉంది దాన్ని పరిశీలించండి అంటూ అని తెలిపారు. ఇప్పటికే మైనింగ్ అధికారులు కూడా ఈ విషయం ఫిర్యాదు చేసి ఉన్నామని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com