Logo
Date of Publish : 24 November 2023, 9:48 pm
Editor : Sake Naresh

శ్రీకాళహస్తిలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం

   శ్రీకాళహస్తి ( జనస్వరం ) :  జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం, గురవరాజు పల్లిలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన - టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని , తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. రైతులకు న్యాయం జరగాలంటే, చదువుకున్న యువత కి ఉద్యోగాలు , ఉపాధి అవకాశాలు రావాలంటే తప్పక పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలని ప్రజలను కోరడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పని గ్రామంలో చెయ్యలేదని, సి. సి రోడ్లు లేవని, డ్రైనేజ్ కాలువలు నిర్మాణం లేదని సమస్యలను ప్రజలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో గ్రామాల్లో ప్రాథమిక అవసరాలన్నీ తీరుస్తానని ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, సీనియర్ నాయకులు లాబ్ భాస్కర్, మాజీ ఎంపీటీసీ జయలలిత, నాయకులు జ్యోతి కుమార్, భాగ్య లక్ష్మి, చంద్రకల, శ్రీనివాసులు, జనసైనికులు తిలక్, కిషోర్, ధనుష్, గాంధీ, మధన్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com