శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, ఏర్పేడు మండలం, పంగూరు పంచాయతీ లోని పంగూరు, పంగూరు హరిజనవాడలో ఈ రోజు ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి,అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. రైతులకు న్యాయం జరగాలంటే, చదువుకున్న యువత కి ఉద్యోగాలు , ఉపాధి అవకాశాలు రావాలంటే తప్పక పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలని ప్రజలను కోరడం జరిగింది. గ్రామంలో పలు సమస్యలు డ్రైనేజీ కాలువలు , స్ట్రీట్ లైట్లు, పారిశుధ్యం తదితర సమస్యలు, రైతులు గిట్టు బాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని వినుత గారి దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో గ్రామాల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షుడు కిరణ్ కుమార్, ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్, నితీష్ కుమార్, వంశీ, నాయకులు శివ, లక్ష్మి, రాజ్య లక్ష్మి, శారద, వెంకట రమణ యాదవ్, చెంచు ముని, రవి కుమార్ రెడ్డి, చిన్న మునయ్యా, పేట చిరంజీవి, పేట చంద్ర శేఖర్, జ్యోతి రామ్, రాజేష్, సురేష్ జనసైనికులు నరసింహ, రమణ, దినేష్, తదితరులు పాల్గొన్నారు.