శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం, గురవరాజు పల్లిలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని , తద్వారా రాష్ట్ర అభివృద్ది కి సహకరించాలని కోరడం జరిగింది. రైతులకు న్యాయం జరగాలంటే, చదువుకున్న యువత కి ఉద్యోగాలు , ఉపాధి అవకాశాలు రావాలంటే తప్పక పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలని ప్రజలను కోరడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక్క పని గ్రామంలో చెయ్యలేదని, సి. సి రోడ్లు లేవని, డ్రైనేజ్ కాలువలు నిర్మాణం లేదని సమస్యలను ప్రజలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో గ్రామాల్లో ప్రాథమిక అవసరాలన్నీ తీరుస్తానని ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల ఉపాధ్యక్షులు వాకాటి బాలాజీ, సీనియర్ నాయకులు లాబ్ భాస్కర్, మాజీ ఎంపీటీసీ జయలలిత, నాయకులు జ్యోతి కుమార్, భాగ్య లక్ష్మి, చంద్రకల, శ్రీనివాసులు, జనసైనికులు తిలక్, కిషోర్, ధనుష్, గాంధీ, మధన్ పాల్గొన్నారు.