శ్రీకాళహస్తి ( జనస్వరం ) : నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో తుఫాను కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి వినుత కోటా దాదాపు 2,000 మందికి అన్నదానం చెయ్యడం జరిగింది. ఉదయం పలు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం అందలేదని, 5 రోజులుగా పనులు లేక తినడానికి ఇబ్బందులు పడుతున్నట్టు ప్రజలు వినుతకి తెలిపారు. పలు గ్రామాల నుండి ఫోన్ ద్వారా ఇబ్బందులు వివరించారు. స్వయంగా పట్టణంలోని నియోజకవర్గ కేంద్ర పార్టీ కార్యాలయంలో నాయకులు, వీర మహిళలు బోజనాలు తయారు చేసి పలు ప్రాంతాల్లో అన్నదానం చెయ్యడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణం ప్రాజెక్ట్ స్ట్రీట్, శ్రీకాళహస్తి మండలం వేడం యస్.టి కాలనీ ,తొట్టంబేడు మండలం ఈదలగుంట, చెంచు లక్ష్మి కాలనీ లో అన్నదానం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు కావలి శివకుమార్, తోట గణేష్, పేట చంద్రశేఖర్, కవిత, శారద, గాయత్రి, రవి కుమార్ రెడ్డి, చిరంజీవి, గురవయ్య, ఉదయ్, జ్యోతి రామ్, దినేష్, బబ్లూ, రాజేష్, సురేష్, హేమంత్, గోపి, వంశీ, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.