ధర్మవరం, (జనస్వరం) : అనంతపురం జిల్లాలో ఏడు దశాబ్దాలుగా ఉన్న ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేసి కొత్త జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటుకానున్న పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ లోకి విలీనం చేస్తూ ధర్మవరంలో రెవెన్యూ డివిజన్ ను తొలగించి చేనేత వ్యవస్థకు, రైతాంగానికి అన్యాయం చేయాలని ఈ YSRCP ప్రభుత్వం చూస్తుంది. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను పునరుద్ధరించవలసినదిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతూ నల్ల రిబ్బన్లు ధరించి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారికి, మరియు ధర్మవరం R.D.O గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్లూరు దాసరి రామాంజనేయులు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, అడ్డగిరి శ్యామ్ కుమార్, మండల కన్వీనర్స్ నాగసుధాకర్ రెడ్డి, పుర్రం శెట్టి రవి, చంద్రబాబునాయుడు, మరియు జిల్లా సంయుక్త కార్యదర్శి దూది జయ రామాంజనేయులు, నాయుడునాయక్, పేరురు శ్రీనివాసులు, కోటికి రామాంజి, నీలురి లక్ష్మీనారాయణ, టోపీ, కడపల సుధాకర్ రెడ్డి,చింతకాయల రాజేష్, దేవా, రాజ్ ప్రకాష్, రవి, సురి, ముచ్చురామి శివ, సురేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.