Logo
Date of Publish : 05 November 2020, 3:18 pm
Editor : Sake Naresh

నిరుపేద కుటుంబానికి జనసేన సాయం : జగ్గయ్యపేట జనసేన బాడిశ మురళీకృష్ణ

నిరుపేద కుటుంబానికి జనసేన సాయం : జగ్గయ్యపేట జనసేన బాడిశ మురళీకృష్ణ

                  జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో నివసిస్తున్నటువంటి నిరుపేద కుటుంబం పల్లపు శ్రీను రిక్షా తొక్కుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూన్నారు. ప్రమాదవశాత్తు ఒక ఆక్సిడెంట్ లో తన కాలికి పెద్ద గాయమై నడవలేని స్థితిలో ఉండటం వలన కుటుంబం గడవటం చాలా కష్టమైన పరిస్థితిలో ఉండటంతో ఈ విషయాన్ని గమనించిన గండ్రాయి గ్రామానికి చెందిన జనసేన నాయకులు పొట్లకాయల నాగయ్య ఆ కుటుంబాన్ని దత్తత తీసుకొని గత మూడు నెలలుగా వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్న క్రమంలో ఈ రోజు కూడా నాగయ్య ఆధ్వర్యంలో సరుకుల పంపిణీలో భాగంగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ అతన్ని పరామర్శించి మురళీకృష్ణ చేతులు మీదుగా వారికీ 25 కేజీల బియ్యం మరియు నెలకు సరిపడ నిత్యవర సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడిన శ్రీను కాలికి గాయం తగ్గి మాములు స్థితికి వచ్చే దాక జనసేన పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని వారికీ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జనసేన మండల నాయకులు తులసి బ్రహ్మం మరియు గ్రామ జనసైనికులు యరమల గోపి, భూక్యా గోపి, ఉపేందర్, మైదాసు గోపి, నామాల వెంకటేష్, నామాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com