జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 8వ రోజు సేవాదానం
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా కడప నగరంలో 8వ రోజు 8వ కార్యక్రమం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కడప నగరనికి చెదిన లక్ష్మీ కుమారి గారికి సహాయం చేయడం జరిగింది. జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులు నాగి జయరామ్, నల్ల బోయిన వెంకట్, గార్ల ఆధ్వర్యంలో పండ్రా రంజిత్ కుమార్ గారి అధ్యక్షతన ఐదు వేల రూపాయలు నిత్యావసర సరుకులు మరియు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ శివ ప్రసాద్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా శివ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ మా మిత్ర పక్షం రాష్ట్ర రాజకీయాల్లో స్వార్థపరుడు మంచి మనిషి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు కడప జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ఒక కుటుంబాన్ని ఆదుకుంటూ ఆ కుటుంబానికి అండగా నిలబడడం చాలా సంతోషమని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన జనసేన హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి అధ్యక్షులు, కాంచన శ్రీకాంత్ గారికి మరియు ఈ రోజు లక్ష్మీ కుమారి, ప్రసాద్ శర్మ దంపతులకు సరుకులు ఐదు వెల రూపాయలు ఆర్థిక సహయం చేసిన దాతలు జయరామ్ గారికి వెంకట్ గార్లకు రంజిత్ కుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి తెలియచేశారు.
పండ్రా రంజిత్ కుమార్ మాట్లాడుతూ కుల మత ప్రాంతాలకు అతీతంగా స్థాపించిన జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని కుల మత వర్గ భేదాలకు అతీతంగా ప్రతిరోజు ఒక కుటుంబాన్ని ఎన్నుకొని ప్రస్తుతం ఆ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, జీవన ఇబ్బందులను, ఆరోగ్య ఇబ్బందులు, ఇలా చాలా సమస్యలు ఉన్నా కుటుంబాలను కనుక్కొని ఆ కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ 35 రోజులు 35 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ రవి ప్రసాద్, అతికారి నాగేంద్ర, వంశీకృష్ణ, వెంకటేష్, రాఘవ, బిజెపి యువ నాయకులు కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.