జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 31 వ రోజు సేవాదానం
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ సభ్యులు గొంటిపల్లి గురేష్ గారి ఆధ్వర్యంలో 18వ డివిజన్ ఎ ఎల్ కాలని కి చెదిన జనసేన నాయకులు బాలు నాయక్, అతికారి నాగేంద్ర గార్ల అధ్యక్షతన ముందు వెనక ఎవరూ లేని ఒక నిరుపేద కుటుంబానికి ఐదు వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు ( ఇందులో రెండు బియ్యం ప్యాకెట్లు 20 రకరకాల సరుకులు ) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజంపేట జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ ముఖరం చాంద్, మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ గార్లు పాల్గొని వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖరం చాంద్ మాట్లాడుతూ జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో గత 35 రోజుల నుంచి కడప జిల్లా వ్యాప్తంగా చేస్తున్న సేవలు హర్షనీయమని ఒక పార్టీ అధ్యక్షుడు పుట్టినరోజు వేడుకలు 35 రోజుల పాటు నిర్వహించడం ఆషా మాషి అయిన విషయం కాదని అది ఒక జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మాత్రమే సాధ్యమని ఇంటువంటి కార్యక్రమాల్లో నేను కూడా పాలు పంచుకోవడం చాలా గర్వంగా ఉందని తెలిపారు. పండ్రా రంజిత్ కుమార్ మాట్లాడుతూ మకుటం లేని మహారాజు విలువలతో రాజకీయం చేసే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 35 రోజులు 35 కార్యక్రమాల్లో భాగంగా 31 వ కార్యక్రమం ఈరోజు 18వ డివిజన్ ఎ, ఎల్ కాలనికీ చెందిన ఒక నిరుపేద కుటుంబానికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేయడం ఆ కుటుంబానికి అండగా నిలబడడం చాలా సంతోషంగా ఉందని ఇటువంటి అభాగ్యులను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టిన జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు చంద్రశేఖర్ గారికి, అధ్యక్షులు కంచన శ్రీకాంత్ గారికి మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజంపేట జనసేన పార్లమెంట్ ఇంచార్జ్ ముఖరం చాంద్ ఈరోజు కార్యక్రమం దాత గుంటిపల్లి గురేష్ గారికి నా తరఫున జనసైనికుల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపాల్ నాయక్, అతికారి నాగేంద్ర, బాలు నాయక్, కుమార్ నాయక్, సుధీర్ నాయక్, వంశీకృష్ణ, మల్లి, రమేష్, దుర్గాప్రసాద్ నాయక్, పాల్గొన్నారు.