జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 26 వ రోజు సేవాదానం
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులు నారపుశెట్టి బలరాం, పుల్లంపేట శివ, పుల్లంపేట హరి గార్ల ఆధ్వర్యంలో మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలం లోని కాశినాయన అవధూత వృద్ధాశ్రమం నందు వచ్చే చలికాలం దృష్టిలో పెట్టుకొని వృద్ధులకు దుప్పట్లు కొత్త బట్టలు ఆశ్రమానికి రెండు ఫ్యాన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మైదుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పందిటి మల్హోత్ర గారు పాల్గొని ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవా అని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ నిరుపేద ప్రజలకు అభాగ్యులకు అండగా నిలబడడం చాలా ఆనందంగా ఉందని ఇలాంటి అభాగ్యులను గుర్తించి వారికి అండగా నిలుస్తున్నందుకు జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు చంద్రశేఖర్ గారికి, అధ్యక్షులు కంచన శ్రీకాంత్ గారికి మరియు కడప జిల్లా వ్యాప్తంగా 35 రోజుల పాటు 35 కార్యక్రమాలు తన భుజస్కంధాల పైన వేసుకొని కోఆర్డినేషన్ చేస్తున్న పండ్రా రంజిత్ కుమార్ కి అభినందనలు తెలిపారు. పండ్రా రంజిత్ కుమార్ మాట్లాడుతూ మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా 35 రోజుల పాటు 35 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందులో భాగంగా ఈరోజు 26వ రోజు 26వ కార్యక్రమాన్ని చాపాడు మండలం లోని అవధూత కాశి నాయన వృద్ధాశ్రమం నందు వృద్ధుల అవసరాల నిమిత్తం దుప్పట్లు బట్టలు ఫ్యాన్లులను పంపిణీ చేయడం జరిగింది ఎటువంటి కల్మషం స్వార్థం లేనటువంటి ఎల్లప్పుడు ప్రజాసేవే తనకు మనస్ఫూర్తినిస్తుందని నమ్మిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి పుట్టినరోజు వేడుకలు కడప జిల్లా వ్యాప్తంగా 35 రోజుల పాటు 35 సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులు నారపుశెట్టి బలరాం గారికి, పుల్లంపేట శివ గారికి, పుల్లంపేట హరి గారికి, మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పందిటి మల్హోత్ర గారికి, కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మైదుకూరు నియోజకవర్గం జనసైనికులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చాపాడు మండలం జనసేన ఇంచార్జ్ శ్రీరామ్ వంశీ, అతికారి నాగేంద్ర, బాలునాయక్, సుధీర్, దీటీ గోపాలకృష్ణ, ముద్దం వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com