Logo
Date of Publish : 25 August 2020, 1:16 pm
Editor : Sake Naresh

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 25 వ రోజు సేవాదానం

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 25 వ రోజు సేవాదానం

         జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ సభ్యులు చవ్వాకుల గంగాధర్ గారి కుమార్తె చవ్వాకుల తనూష గారి పుట్టినరోజు సందర్భంగా చెన్నూరు మండల జనసేన నాయకులు అద్దంకి విశ్వనాథ్ గారి అధ్యక్షతన 35 రోజులు 35 కార్యక్రమాలలో భాగంగా 25 వ రోజు 25వ కార్యక్రమం కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలం లోని ఏ దిక్కు లేని నిరుపేద వృద్ధురాలికి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ( ఇందులో రెండు బియ్యం ప్యాకెట్లు 20 రకాల సరుకులు ) పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు, నిరుపేద ప్రజలకు, అభాగ్యులకు, జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అందులో భాగంగానే మా జనసేనాని పుట్టినరోజును పురస్కరించుకొని 35 రోజుల ముందు నుంచే కడప జిల్లా వ్యాప్తంగా ఇలాంటి నిరుపేదలను అభాగ్యులను గుర్తించి వారికి వివిధ రకాలగా అండగా నిలవడం జరుగుతుందని అన్నారు ఈ రోజు ఈ నిరుపేద వృద్దరాలు వేంకటసుబ్బమ్మ గారికి అండగా నిలిచిన చవ్వాకుల గంగాధర్ గారికి అభినందనలు తెలిపారు. అద్దంకి విశ్వనాథ్ గారు మాట్లాడుతూ ఒక నాయకుడు పుట్టిన రోజు వేడుకలను గత 35 రోజులుగా నిర్వహించడం అది ఒక పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కార్యకర్తలకే సాధ్యం అయ్యిందని జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో గత 35 రోజుల నుంచి 35 రోజులు 35 కార్యక్రమాలు కడప జిల్లా వ్యాప్తంగా చేపట్టడం అవి విజయవంతంగా నడుస్తుండడం చాలా సంతోషం. ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు చేపట్టిన జనసేన హెల్పింగ్ హాండ్స్ అధ్యక్షులు గంగారపు చంద్రశేఖర్ గారికి అధ్యక్షులు కంచన శ్రీకాంత్ గారికి 35 రోజులు కార్యక్రమాలు తన చేతుల మీదుగా కడప జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రంజిత్ కుమార్ గారికి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమలాపురం జనసేన నాయకులకు, జన సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ సిద్దు, అతికారి నాగేంద్ర, వంశీకృష్ణ, శ్రీనివాస్, వినయ్, వరుణ్, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com