జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 23 వ రోజు సేవాదానం
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులు నాగూరి నాగరాజు గారి ఆధ్వర్యంలో కమలాపురం జనసేన నాయకులు రామ్ సిద్దు, అతికారి నాగేంద్ర గార్ల అధ్యక్షతన కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రి మండలం ఎస్సీ కాలనీ కి సంబంధించిన సుంకమ్మ అనే చూపు లేని నిరుపేద మహిళలకు కుటుంబానికి మూడు నెలలకు సరిపడా నిత్యవసర సరుకులు ( ఇందులో రెండు బియ్యం ప్యాకెట్లు 20 రకరకాల సరుకులు ) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ విపత్కర పరిస్థితులు నెలకొన్నా ముందుగా స్పందించే హృదయం జనసేన కార్యకర్తలకు మెగా అభిమానుల కే సాధ్యం అని కరోనా మహమ్మారి తో యుద్ధం చేస్తూ లాక్ డౌన్ కారణంగా అనేక మంది అభాగ్యుల కుటుంబాలు పూటగడవని లేని పరిస్థితుల్లో ఉన్నాయని అటువంటి వారిని గుర్తించి వారి కుటుంబానికి అండగా నిలిచి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని అందులో భాగంగానే ఈ రోజు సుంకమ్మ అని చూపు లేని నిరుపేద మహిళ కుటుంబానికి ఈ విధంగా ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇంత మంచి కార్యక్రమానికి ముందు వచ్చిన జనసేన హెల్పింగ్ హాండ్స్ సభ్యులు నాగూర్ నాగరాజు గారికి ఈ కార్యక్రమం కు అధ్యక్షత వహించిన రామ్ సిద్దు గారికి, అతికారి నాగేంద్ర గారికి అభినందనలు తెలిపారు రామ్ సిద్దు, అతికారి నాగేంద్ర మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా 35 రోజులు 35 కార్యక్రమాలలో భాగంగా 23వ రోజు 23వ కార్యక్రమం మా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రి మండలానికి చెందిన సుంకుమ్మ కు మూడు నెలలపాటు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు చంద్రశేఖర్ గారికి, అధ్యక్షుడు కంచన శ్రీకాంత్ గారికి, మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కో-ఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షరీఫ్ షబ్బీర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.