జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 20 వ రోజు సేవాదానం
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మైదుకూరు నియోజకవర్గంలోని చాపాడు మండల పరిధిలో జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ సభ్యులు పుల్లంపేట శివ ఆధ్వర్యంలో కమలాపురం జనసేన సైనికుడు అతికారి నాగేంద్ర అధ్యక్షతన పద్మావతి అనే నిరుపేద వృద్ధురాలికి ఐదు వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ( ఇందులో రెండు బియ్యం ప్యాకెట్లు 20 రకాల సరుకులు) ఉన్నాయి. చాపాడు మండలం జనసేన ప్రధాన కార్యదర్శి ముద్దం వెంకటరమణ, అతికారి నాగేంద్ర గార్ల చేతులమీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా 35 రోజులు 35 కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పద్మావతి అనే ఏ దిక్కు దిశ లేని ఈ పెద్దమ్మకు రెండు నెలలకు సరిపడ నిత్యావసర సరుకుల కిట్ ను అందజేయడం జరిగింది. కడప జిల్లా వ్యాప్తంగా గత ఇరవై రోజుల నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇంకా ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నా జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగారపు చంద్రశేఖర్ గారికి, అధ్యక్షుడు కంచన శ్రీకాంత్ గారికి మరియు ఈరోజు కార్యక్రమం దాత పుల్లంపేట శివ గారికి అలాగే 35 రోజుల పాటు కార్యక్రమాలని ఆర్గనైజింగ్ చేస్తున్న రంజిత్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుబ్బు, పొన్నతోట పాములేటి, రోటికాడి భాస్కర్, పి ప్రసాద్, రంగాగల పెద్ద నరసింహుడు, ధర జానీ, వినోద్, చక్ర, నరసింహుడు, పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com