జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 17 వ రోజు సేవాదానం
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలలో సందర్భముగా జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ సభ్యులు నాగూరి రామకృష్ణ ఆధ్వర్యంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ అధ్యక్షతన సుబ్బమ్మ, వెంకట సుబ్బమ్మ, అనే ఇద్దరు నిరుపేద మహిళ కుటుంబాలకు ఐదు వేల రూపాయలు నిత్యావసర సరుకులు ( ఇందులో రెండు బియ్యం ప్యాకెట్లు 20 రకాల సరుకులు ) పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్ ముఖరం చాంద్ పాల్గొని ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖరం చాంద్ గారు మాట్లాడుతూ జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో గత 17 రోజుల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భముగా 35 రోజులు 35 కార్యక్రమాలలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు రామాపురం మండలం లోని సుబ్బమ్మ, వెంకట సుబ్బమ్మ అనే మహిళలకు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకుల కిట్లను అందజేయడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా చేపట్టిన జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగారపు చంద్రశేఖర్ గారికి, అధ్యక్షులు కంచన శ్రీకాంత్ గారికి దాత నాగురి రామకృష్ణ గారికి 35 రోజుల పాటు కార్యక్రమాలన్నింటినీ తన చేతుల మీదుగా నిర్వహిస్తున్న రంజిత్ కుమార్ గారికి రాయచోటి జనసేన సైనికులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలాపురం జనసేన నాయకులు రామ్ సిద్ధూ, అతికారి నాగేంద్ర, రాయచోటి జనసైనికులు పవన్ కుమార్, నాగేంద్ర, కిరణ్, కోండ, సంజీవ్, కుమార్ నాయక్, పాల్గొన్నారు.