Logo
Date of Publish : 15 August 2020, 5:27 am
Editor : Sake Naresh

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 14 వ రోజు సేవాదానం

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 14వ రోజు సేవాదానం

         జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హాండ్స్ కువైట్  సభ్యులు కొత్తూరు మల్లికార్జున్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్  కోఆర్డినేటర్ పండ్రా రంజిత్ కుమార్ గారి అధ్యక్షతన ఒక నిరుపేద మైనార్టీ కుటుంబానికి ఐదు వేల రూపాయలు విలువగల నిత్యావసర సరుకులు ( ఇందులో రెండు బియ్యం ప్యాకెట్లు 20రకాల సరుకులు పంపిణీ) చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాయచోటి జనసేన ఇంచార్జ్ హసన్ భాష, జనసేన గారు పాల్గొని వారి చేతుల మీదుగా అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం సామాజిక న్యాయం స్థిరతత్వం ప్రతి ఒక్కరూ బాగుండాలనే అలోచన విధనం ఇవే జనసేన పార్టీ ధ్యేయం జనసేన కార్యకర్తల లక్ష్యం ఈ విధంగా పని చేస్తూ ప్రజల కష్టాలు, మా కష్టాలుగా ప్రజల సమస్యలు మా సమస్యలు గా తీసుకొని వారికి అండగా నిలబడి ప్రతి ఒక్కరూ బాగుండాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకునే ఏకైక పార్టీ జనసేన పార్టీ.  మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అటువంటి మా నాయకుడు పుట్టినరోజు పురస్కరించుకొని 35 రోజులు ముందు నుంచే ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమం చేయడం అందులో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు జనసేన హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్ గారికి, కంచన శ్రీకాంత్ గారికి, పండ్రా రంజిత్ కుమార్ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పండ్రా రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగిన నేత మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకలు సందర్భముగా 35 రోజులు 35 కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు రాయచోటి నియోజకవర్గంలో నిరుపేద మైనార్టీ కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి వారి కుటుంబానికి అండగా నిలబడినందుకు జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు మల్లికార్జున్ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వారి చేతుల మీదుగా ఈ సరుకులు అందజేసిన హసన్ భాషా గారికి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, ప్రదీప్, పఠాన్, అతికారి నాగేంద్ర, పవన్ కుమార్, పాల్గొన్నారు. 

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com