Logo
Date of Publish : 11 August 2020, 3:07 pm
Editor : Sake Naresh

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 11వ రోజు సేవాదానం

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి అధ్వర్యంలో జనసేనాని పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 11వ రోజు సేవాదానం

            జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు కడవకూటి పెంచలయ్య ఆధ్వర్యంలో మాజీ కడప జిల్లా జనసేన సేవాదళ్ కోఆర్డినేటర్ రంజిత్ కుమార్ అధ్యక్షతన వీరబల్లి మండలం వంగిమల్ల పెద్దూరు గ్రామంలో నివాసముంటున్న షేక్ బాషు, ఫాతిమా, గార్లకు ఐదు వేల రూపాయల విలువ గల నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు (ఇందులో రెండు బియ్యం ప్యాకెట్లు మరియు 20  రకాల సరుకులు) ఉన్నాయి.  ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ జనసేన ఇంచార్జ్ ముఖరం చాంద్, జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ అధ్యక్షులు కంచన శ్రీకాంత్ గార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖరం చాంద్ మాట్లాడుతూ రాజంపేట నియోజకవర్గం వీరబల్లి మండలం వంగిమల్ల పెద్దూరు గ్రామంలో బాషు, ఫాతిమా గార్లు చిన్న పుర గుడిసెలో నివాసముంటున్నారు. అది ప్రమాదవశాత్తు కాలిపోవడంతో గుడిసెల్లో ఉన్న సామాగ్రి అన్ని కాలిపోయాయి దీనితో రోడ్డున పడ్డ ఆ కుటుంబానికి వీరబల్లి మండల జనసైనికులు జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి దృష్టికి తీసుకు వెళ్ళడంతో వారు తక్షణమే స్పందించి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా 35 రోజులు 35 కార్యక్రమాలు సందర్భంగా ఈరోజు వీరికి ఐదు వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. మైనార్టీల సంక్షేమం మైనారిటీల అభ్యున్నతికి పాటుపడే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక జనసేన పార్టీ మాత్రమే. ఈరోజు వీరికి చేసే సహాయం చిన్నదే అవ్వచ్చు కానీ మేము ఈ రోజు ఈ కుటుంబానికి అండగా నిలబడి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీరి స్థలంలో ఇల్లు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు జనసేన హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు గంగారపు చంద్రశేఖర్ గారికి అధ్యక్షుడు , కంచన శ్రీకాంత్ గారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రంజిత్ కుమార్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కంచన శ్రీకాంత్ మాట్లాడుతూ దీక్షా పరుడు సేవా తత్పరుడు ప్రతి సమస్యకు పరిష్కారం చూపే మార్గం నిర్దేశకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా 11వ రోజు 11వ కార్యక్రమంను ఈరోజు వంగిమల్ల పెద్దూరు గ్రామంలో ఈ నిరుపేద మైనార్టీ కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసి వారికి అండగా నిలబడడం చాలా సంతోషం సమస్య ఎక్కడ ఉంటే జనసేన పార్టీ అక్కడ ఉంటుంది అనే మాటకు ఈ కార్యక్రమమే నిదర్శనం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖరం చంద్ గారికి మాకు సహకరించిన రాజంపేట జనసేన ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ గారికి మరియు ఈ రోజు ఈ కుటుంబానికి సహకారం అందించిన కడవకూటి పెంచలయ్య గారికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BJYM స్టేట్ లీడర్ లోకేష్, రాయచోటి BYYM టౌన్ ప్రెసిడెంట్ అనంతరాజు మరియు జనసేన సైనికులు అలి కుమార్, వినోద్, అతికారి నాగేంద్ర, శ్రీనివాస్, హరీష్, నాగేంద్ర, నాగరాజు, పవన్ కుమార్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com