Logo
Date of Publish : 06 August 2020, 3:54 pm
Editor : Sake Naresh

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ – కువైట్ అధ్వర్యంలో 6వ రోజు సేవాదానం

జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ - కువైట్ అధ్వర్యంలో 6వ రోజు సేవాదానం

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడి కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ 

             ప్రపంచం మొత్తం మానవాళి కరోనాతో అనారోగ్యిన పడింది. జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసైనికులు జనసేవ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మంది పేదలకు సహాయం చేశారు. జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ - కువైట్ అధ్వర్యంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజున సందర్భంగా 35 రోజులు సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ఇందులో భాగంగా 6 వ రోజు కడప నగరంలోని బుడ్డాయిపల్లిలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడు మధు కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం పాకెట్లు, 20 రకాల నిత్యావసర సరుకులను అందజేశారు. జనసేన హెల్పింగ్ హ్యాండ్స్ - కువైట్ అధ్వర్యంలో నెలరోజుల పాటు సేవాకార్యాక్రమాలు చేయడం ఎంతో మందికి స్పూర్తినిస్తోంది. ఈ కార్యక్రమాన్ని రాయలసీమ జిల్లాల్లో  కూడా నిర్వహించడం సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న జనసేన నాయకులకు అభినందలు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న జనసైనికులు జనసేన హెల్పింగ్ హాండ్స్-కువైట్ అధ్యక్షులు కంచన శ్రీకాంత్ గారు, వ్యవస్థాపకులు గంగారపు చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో రవణమ్మ, మధు గార్లు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎన్. రవి ప్రసాద్, కమలాపురం జనసేన నాయకుడు రామ్ సిద్ధూ, కడప జనసైనికులు వంశీకృష్ణ, రాఘవ, వెంకటేష్, రాజా, భాస్కర్, పాల్గొన్నారు.

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com