
విజయనగరం, (జనస్వరం) : ఉత్తరాపల్లి గాంధీనగర్ లో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధితులకు జనసైనికులు అండగా నిలిచారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుస్తులు అందించారు. గ్రామానికి చెందిన పొట్నూరు వెంకట రమణ ఇల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఇంట్లోని మొత్తం సామగ్రి కాలి బూడిదైంది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు స్పందించారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆపన్నహస్తం అందించారు. నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలు, దుస్తులు, దుప్పట్లు అందించారు. ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉండాలనే పవన్ కల్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని వబ్బిన సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గొరపల్లి రవికుమార్, మల్లువలస శ్రీను, గాలి అప్పారావు, గోకాడ సూర్యనారాయణ, అరవింద్, ఎర్నిబాబు, జనసైనికులు పాల్గొన్నారు.