నిరుపేద కుటుంబానికి జనసేన సాయం : బాడిశ మురళీకృష్ణ
జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామంలో నివసిస్తున్నటువంటి నిరుపేద కుటుంబం పల్లపు శ్రీను రిక్షా తొక్కుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూన్నారు. ఒక ఆక్సిడెంట్ లో తన కాలికి పెద్ద గాయమై నడవలేని స్థితిలో ఉండటం వలన కుటుంబం గడవటం చాలా కష్టమైన పరిస్థితి లో ఉండటంతో ఈ విషయాన్ని గమనించిన గండ్రాయి గ్రామానికి చెందిన జనసేన నాయకులు పొట్లకాయల నాగయ్య ఆ కుటుంబాన్ని దత్తత తీసుకొని గత నెల రోజులుగా వారికీ నిత్యవసరా వస్తువులు ఇస్తున్నారు. అలాగే ఈ రోజు కూడా నాగయ్య ఆధ్వర్యంలో సరుకుల పంపిణీలో భాగంగా జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ అతన్ని పరామర్శించి మురళీకృష్ణ చేతులు మీదుగా వారికీ 25 కేజీల బియ్యం మరియు నెలకు సరిపడ నిత్యావర సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది. అలాగే మురళీకృష్ణ మరియు మండల నాయకులు తులసి బ్రహ్మం వారిక వైద్య ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మురళీకృష్ణ మాట్లాడుతూ వారికీ కాలికి గాయం తగ్గేంత వరకు ఆ కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని వారికీ భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన మండల నాయకులు తులసి బ్రహ్మం గండ్రాయి గ్రామ జనసైనికులు కర్లపూడి గోపి, నామాల వెంకటేష్, మైదాసు గోపి, పల్లపు గోపి, కృష్ణ, కనకారావు తదితరులు పాల్గొన్నారు.