రాజంపేట ( జనస్వరం ) : జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో నలుమూలల ఉన్న చెత్తను తీసి దోమల బెడద నివారణ చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ తరపున డిమాండ్ చేశారు. అదేవిధంగా గత రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలందరూ వైసీపీ అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధులు పట్టణ అభివృద్ధి కోసం మరియు శుభ్రత గురించి ఏ మాత్రం బాధ్యత లేకుండా పోయిందని జనసేనపార్టీ తరపున మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడపజిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బారాయుడు, పార్టీ నాయకులు వెంకటయ్య, యువ నాయకుడు అబ్బిగారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com