
కడప నగరంలోని ఐటిఐ సర్కిల్ లో నివాసముంటున్న దూదేకుల హుస్సేన్ అనే వ్యక్తి జీవనోపాధి లేక కరోనా కష్టకాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటన్నారు. కుటుంబ పోషణ కష్టమైన సమయంలో కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ పండ్రా రంజిత్ కుమార్ గారి సహాయం కోరగా జనసేన గల్ఫ్ ఎన్నారై సేవా సంస్థ వారిని సంప్రదించారు. ఆ సంస్థ ముఖ్యలు శ్రీ శెట్టిపల్లి వెంకట, ప్రసాద్ గుంటూర్ శంకర్, అబ్బన్న గారి రాజ, కందుకూరి పాములేటయ్య, శెట్టి సునీల్, శివ బంగారం, హరికృష్ణ, ఆనంగి ప్రసాద్, కొట్టే శ్రీహరి, మహేష్, గార్ల సహకారంతో కడపలో దూదేకుల హుసేన్ గారికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన గల్ఫ్ ఎన్నారై సేవా సంస్థ సభ్యులకు దూదేకుల హుసేన్ గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి సురేష్, బాలు నాయక్, వంశీకృష్ణ, సందీప్, మున్నా పాల్గొన్నారు.