Logo
Date of Publish : 24 October 2023, 8:20 pm
Editor : Sake Naresh

“నిజం గెలవాలి” కి జనసేన సంపూర్ణ మద్దతు

- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కలయిక రాష్ట్రానికి ఎంతో అవసరం

- చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో భేటీలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

           తిరుపతి ( జనస్వరం ) : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల కలయిక రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. మంగళవారం ఆయన నారావారిపల్లెలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చాయి. బుధవారం నుంచి భువనేశ్వరి చేపట్టనున్న "నిజం గెలవాలి" కార్యక్రమానికి జనసేన సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. చంద్రబాబు చేయని తప్పుకు కేసులో ఇరికించారన్నారు. టిడిపి - జనసేనకు ప్రజల నుంచి మద్దతు ఉందని తెలిపారు. దేవుడితో పాటు ప్రకృతి కూడా టిడిపి-జనసేన కూటమికి అనుకూలంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రెండు పార్టీల సమన్వయంతో ఉమ్మడి పోరాటం చేస్తామన్నారు. జనసేన రాష్ట్ర, జిల్లా కమిటీల ప్రతినిధులు కలిసి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని నారా భువనేశ్వరికి తెలిపారు. జనసేన మద్దతుపై భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై ఉమ్మడి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com