Logo
Date of Publish : 15 March 2026, 1:58 am
Editor : Sake Naresh

ఉప్పల్‌లో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఉప్పల్, మార్చి 14, (జనస్వరం) : ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇన్చార్జి నిహారిక నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీటీడీ LAC చైర్మన్ మరియు రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పనిచేసిన సాధకులను సత్కరించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ సమాజంలో సమానత్వం కోసం జనసేన పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ మరింత బలపడుతుందని పేర్కొన్నారు. నిహారిక నాయుడు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు విద్య, వైద్యం, రాజకీయ అవకాశాలు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గంలో జనసేన జెండాను ఎగురవేయాలని కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రత్నా పిల్లా మాట్లాడుతూ నీరు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో ప్రజల గొంతుకగా జనసేన పార్టీ నిలుస్తుందని తెలిపారు. ఉప్పల్ గడ్డపై జనసేన జెండా ఎగురవేయడానికి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు అరుణ కుమారి, నాగ లక్ష్మీ, వెంకట లక్ష్మీ, పద్మజతో పాటు జనసేన నాయకులు శివ కార్తీక్, రామకృష్ణ, శేషు, రాంబాబు, రమేష్, సూర్యతోరం, మధు, నాగరాజు, సర్వేశ్, కళ్యాణ్, నరేంద్ర, మోహన్, ఫణి, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com