Logo
Date of Publish : 15 March 2026, 2:13 am
Editor : Sake Naresh

క్వీన్స్‌ల్యాండ్‌లో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

క్వీన్స్‌ల్యాండ్, మార్చి 14, (జనస్వరం) : ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనసేన ఆస్ట్రేలియా–క్వీన్స్‌ల్యాండ్ టీమ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ స్థాపన దినోత్సవాన్ని ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాల పట్ల ఉన్న నిబద్ధతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనసైనికులను ఒక్కటిగా నిలబెడుతోందని తెలిపారు. స్వదేశానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ జనసేన ఆత్మస్ఫూర్తి ఆస్ట్రేలియాలో కూడా బలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. న్యాయం, నిజాయితీ, ప్రజాకేంద్రీకృత రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ చూపుతున్న మార్గంలో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జనసైనికుడు పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తరింపజేయడానికి కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జనసేన జెండా ఆవిష్కరించి పార్టీ ఆశయాలను గుర్తుచేసుకున్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ స్వదేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని జనసైనికులు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసేన సిద్ధాంతాలను మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com