" రాహువు పట్టిన పట్టొకసెకెండు అఖండమైతే లోక భాందవుడసలే లేకుండా పోతాడా " గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్లు ఒక్క ఓటమి జనసేనను జనానికి చేరువ కాకుండా ఒక్క క్షణం కూడా ఆపలేకపోయింది. ఒక్కో ఏడాది బలపడుతూ, ప్రత్యర్ధులను భయపెడుతూ సమస్యల పట్ల స్పందిస్తూ, సాధనకై పోరాటం చేస్తూ కుల, ధన స్వామ్య రాజకీయాలకు ధీటుగా సామాన్యుని రాజకీయ చైతన్యంతో 8 వ వసంతంలోకి అడుగుపెడుతోంది. అధికార దర్పం చూపిస్తూ కులం, ధనం పేరిట కోటలు, కోటరీలు నిర్మించుకుంటూ అధికారానికి దారులు వేసుకుంటూ నువ్వో - నేనో అనుకునే చాటు మాటు ఒప్పందాలతో, చీకటి బంధాలతో మూడో రాజకీయ ప్రత్యామ్నయాన్ని ఎదగనీయకుండా అడ్డుకునే పరిస్థితిని అధిగమించి జనం గుండెల్లో నేడు స్థానం ఏర్పరుచుకున్నది. సామాన్య జనం తమ బాధ్యతను, హక్కులను మర్చిపోతున్న తరుణంలో సామాన్యుని తరుపున ప్రశ్నించే గళంగా నేనున్నానంటూ, నవ, యువ రాజకీయ వ్యవస్థగా 14 మార్చి, 2014న ఎన్నో ఆశయాలతో, సిద్ధాంతాలతో ప్రారంభమైనది జనసేన మహా ప్రస్థానం. 7 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో సవాళ్లు, ఒడిదుడుకులు, అవమానాలు, ఎదుర్కోలేక చేసే మాటల దాడులు, ఓటములు, ఓటమిని మరిపించిన ఎన్నో సమస్యల సాధనలు. సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ ఆవిర్భావం నుండి ఎన్ని పరిణామాలు జరిగినా, రాజకీయ సమీకరణాలు మారినా, ఆశించిన ఫలితాలు రాక భంగపడినా అధినేత ఆత్మ స్థైర్యమే జనసైనికులూ నింపుకొని, ఓటమికి కృంగిపోకుండా అలుపెరుగని యోధుల వలె ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తమ గళాన్ని వినిపిస్తూ అహర్నిశలు పార్టీ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నారు.
"ఒకడు పుష్పహారాల బరువుతో పొంగిపోతాడు. ఒకడు గాయాలు లెక్కపెట్టుకుంటూ ఉప్పొంగిపోతాడు" శేషేంద్ర శర్మ గారు కవితా సంపుటిలో చెప్పినట్లు ఓటమి చేసిన గాయాన్ని సమస్యల కోసం పోరాడుతూ మాన్పుకున్న అలుపెరుగని ప్రస్థానం జనసేన పార్టీది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, రాజధాని అమరావతి రైతులకు అండగా, సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం, కరోనా ఆపత్కాలంలో కొండంత అండగా జనసేవ, రహదారుల నిర్మాణం కోసం, రైతులకు కోసం, స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ, దివీస్, ఎన్నో సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల పక్షాన నిలబడింది. సార్వత్రిక ఎన్నికలు చేసిన ఖాళీని పంచాయితీ ఎన్నికలు మంచి ఫలితాలతో భర్తీ చేశాయి. విజయం అడుగులకు ధైర్యం నిచ్చింది, మాటలకు స్థైర్యం పెంచింది, చేతలకు మరింత బలం వచ్చింది, పట్టుదల పెరిగింది. సామాన్యులను రాజకీయ నాయకులుగా మార్చాలన్న అధినేత కల నిజమైంది. రాజకీయంలో ఉండే ప్రతి నాయకుడికి ఎంతో కొంత పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. కానీ జనసేన పార్టీ పరిస్థితి వేరు సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా కోట్ల మంది అభిమానులు ఆయన సొంతం, వృత్తి పరంగా, జనసేన పార్టీ అధినేత గా ఆయనకు ఉన్న బాధ్యతలను గౌరవించాలి. జోడు గుర్రాల స్వారీ అంత సులువు కాదు.
ఏ విషయంలో అయినా బాధ్యతాయుతంగా స్పందించడం ముఖ్యం పార్టీ పట్ల మనకెంత నిబద్ధత ఉన్నదో పార్టీ అధినేతగా కోట్ల మంది నమ్మకాన్ని గెలిపించటం ఆయనకు పెద్ద బాధ్యత అన్ని విషయాల్లో స్పష్టతతో సాగే అధినేతను మరో ఆలోచన లేకుండా అనుసరించటం ముఖ్యం. దశాబ్దాలుగా రాజకీయ ఆధిపత్యం చెలాయిస్తున్న నాయకుల కుటిల నీతిని తట్టుకొని ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకొని సరైన రాజకీయ ప్రత్యామ్నయంగా ఎదుగుతూ అవకాశవాద రాజకీయాలకు, దగాకోరు, మోసపూరిత వాగ్దానాలకు తావు లేని రాజకీయం చేయటం సామాన్యమైన విషయం కాదు. ఓటమిని ధిక్కరించి గెలుపుకు బాటలు వేసుకుంటూ, సేవా కార్యక్రమాలు చేయటమే కాదు అంతకు మించిన నిస్వార్థ రాజకీయం చేస్తూ సాగిపోతుంది. కులం పునాదుల మీద ధనం పెట్టుబడిగా మీడియా చేస్తున్న అసత్య ప్రచారాలను, మాటల దాడులను సామాజిక మాధ్యమాల వేదికగా జనసైనికులు ఎదుర్కోవడం జనసేనకు అతి పెద్ద బలమైతే క్షేత్ర స్థాయిలో ప్రజల సంక్షేమం కోసం, సమస్యల కోసం పోరాడుతున్న నిస్వార్థ జనసైన్యం కలిగిన జనసేన రానున్న రోజుల్లో ప్రత్యర్థుల కుట్రలను ఎదుర్కొంటూ అధికారం అందుకునే దిశగా రాజీ లేని రాజకీయం చేస్తూ, రాష్ర్ట రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ జనం గుండెల్లో నిలిచిపోతుంది ఇది తధ్యం.
గెలుపంటే నోట్ల కట్టలే ముఖ్యం అని భావించే రాజకీయాలకు విరుద్ధంగా, అభిమానులే ధనంగా కార్యకర్తలే సైన్యంగా విలువలతో కూడిన రాజకీయమే పరమావధిగా నూతన ఒరవడికి శ్రీ కారం చుట్టి, నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి చెక్కుచెదరని సంకల్పంతో మొక్కవోని ధైర్యంతో నడుస్తూ మన సమాజంలో, రాజకీయాల్లో మార్పు రావాలంటే ఆలోచనల్లో మార్పు తప్పని సరి. జవాబుదారీ రాజకీయ వ్యవస్థకు నాంది పలుకుతూ బాధ్యత నిండిన మన భాగస్వామ్యం ఇవ్వటం తప్పని సరి. భావితరాలకు భవిష్యత్తు జనసేననే ఆధారం అవుతుంది. అధినేత కలలు కన్న అవినీతి రహిత, కుల, మత ప్రస్థావన లేని, భాషలని గౌరవిస్తూ, ప్రాంతీయ భేదాలు లేని జాతీయ భావాలతో పాటు ప్రకృతిని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానంతో మన రాజకీయ ప్రస్థానం అధికారం వైపు సాగినప్పుడే అంతిమ లక్ష్యం నెరవేరుతుంది, అదే మన తక్షణ కర్తవ్యం.
- టీం నారీస్వరం
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com