విశాఖపట్నం : జనసేన పార్టీ పారిశుద్ధ కార్మికులకు అండగా ఎప్పుడూ ఉంటుందని, పారిశుద్ధ్య కార్మికుల పట్ల వైకాపా ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించడం ఎంతో దుర్మార్గమని వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని విశాఖ జనసేన దక్షిణ నియోజక వర్గం నేత కందుల నాగరాజు డిమాండ్ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పార్టీ అగ్రనేత నాదెండ్ల మనోహర్ పిలుపు మేరకు అల్లిపుర నేరెళ్ల కోనేరు వద్ద గల పార్టీ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యవసర వస్తువులు వితరణగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి కోవిడ్ సమయంలో పారిశుధ్య కార్మికులు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోకూడదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెదేపా జన సేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం చేయాలని జరుగుతుందన్నారు. పండగ సమయంలో రోడ్లు చెత్త మయం అవ్వడానికి వైసీపీ ప్రభుత్వం కారణమని ఆరోపించారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా ఇబ్బందులు పడుతున్నారని అందుకే దక్షిణ నియోజక వర్గం పారిశుధ్య కార్మికులకు సంక్రాంతి పురస్కరించుకుని నిత్యావసర సరుకులను వితరణగా పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి ప్రభుత్వం నడుస్తుందని రాష్ట్రం వైసిపి సర్కార్ హయాంలో అగ్ని గుండంగా మార్చిందని అభివృద్ధి చేయడం లేదని విమర్శించారు. పారిశుద్ధ కార్మికులకు తన మద్దతు తెలియజేస్తూ ఈ ఏడాది సంక్రాంతి పండుగను కూడా చేసుకోవడం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వార్డ్ అధ్యక్షులు లంక త్రినాథ్, నీలం రాజు, రూప, తెలుగు అర్జున్, శ్రావణ్, జనసేన నాయకులు ప్రణీత్, నరేష్, రఘు, త్రినాథ్, ప్రసాద్ర, రఘు, గాజుల శ్రీను, నగేష్, సతీష్, బద్రిసతీష్, ఆయిల్ జగదీష్, శ్రావణి, ధనాలు కోటి శ్రీకాంత్, వర, కుమారి, దుర్గ, కోదండమ్మ, శ్రీదేవి, లక్ష్మి, సీత, రాజు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com