గంగాధర నెల్లూరు, (జనస్వరం) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం,ఆలత్తూరు గ్రామపంచాయతీ టీటీ కండ్రిగ గ్రామంలో జనసేనపార్టీ నియోజకవర్గ ఇన్చార్జి Dr యుగంధర్ పొన్న సతీమణి స్రవంతి రెడ్డి ఆధ్వర్యంలో జనం కోసం జనసేన ( భవిష్యత్తు గ్యారెంటీ) కార్యక్రమం జరిగింది. స్రవంతి రెడ్డి మాట్లాడుతూ స్వార్థం లేని, పరమత సహనం కలిగి పరోపకారమే పరమావధిగా భావించే గొప్ప తాత్విక భావన కలిగిన, ఆధ్యాత్మిక చింత కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభివృద్ధికి మారుపేరని కొనియాడారు. పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది అని, మనిషిగా జీవించి మరణాన్ని జయించాలని, తద్వారా ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోవాలని , ఎవరు చేయలేని గొప్ప సాహసోపేతమైన కార్యాలు, చరిత్రలో నిలిచిపోయే విధంగా గొప్ప పనులు, సర్వరంగ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే గొప్ప పరిపాలనా దక్షుడని, అందుకే పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి అవసరమని తెలిపారు. నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో కులాలకతీతంగా, మతాలకతీతంగా, ప్రాంతీయ బేధం లేకుండా అభివృద్ధి చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగర్ మండల అధ్యక్షులు శోభన్ బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి అన్నామలై, ఎం ఎం విలాసం పంచాయతీ అధ్యక్షులు రుద్ర, కాపు యువసేన మండల అధ్యక్షులు వెంకటేష్, జనసేన నాయకులు అజిత్, వడివేలు, రాజా, జనసైనికులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com