రాప్తాడు ( జనస్వరం ) : అనంతపురం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు టి.సి వరుణ్ జిల్లాలోని నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రాప్తాడు నియోజకవర్గంలోని పామురాయి గ్రామంలోని కల్యాణ మండపంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని మండల అధ్యక్షులు గంట రామాంజి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గం గత పాలకుల వల్ల అభివృద్ధి చెందక నిర్లక్షతకు గురైందన్నారు. వైసీపీ పార్టీ చేసే అరాచాలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయించుకోవాలని తెలియజేశారు. అలాగే రాష్ట్రంలో అత్యధిక క్రియాశీలక సభ్యత్వ నమోదు చేయించిన రాష్ట్ర ప్రధాన కార్యక్రమాల కార్యదర్శి భవానీరవికుమార్ ను అభినందించారు. భవానీరవికుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జనసేనపార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జనసేన పార్టీ బలోపేతం కృషి చేయాలని కోరారు. రాప్తాడు ఇంచార్జ్ సాకే పవన్ కుమార్ మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ దౌర్జన్యాలు, రౌడీయిజం రోజు రోజుకి పెరుగుతున్నాయని వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. వైసీపీ ఎంఎల్‌ఏ ప్రకాష్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం అబద్ధపు హామీలు ఇచ్చి, ప్రజల ఓట్లతో అందలం ఎక్కి ఆ తర్వాత ప్రజలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తన స్వంత గ్రామం తోపుదుర్తికి సరైన రోడ్డు లేదని, ఇంకా నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని అన్నారు. జిల్లా ఉఫాధ్యక్షులు జయరాంరెడ్డి మాట్లాడుతూ గత పాలకుల వల్ల నియోజకవర్గం ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైందని, వేల మంది సామాన్య ప్రజలు వారి కుటుంబాల ఆధిపత్య పోరుకు బలయ్యారని అన్నారు. ప్రముఖ జాకీ కంపెనీ స్థానిక ఎంఎల్‌ఏ కక్కుర్తి వాటాల కోసం ఈ రోజు ఆ కంపెనీ చెన్నైకి తరిలిపోయిందని అన్నారు. జిల్లా ఉఫాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో జనసేన పార్టీని ఆదరించి ఓట్లు వేయాలని కోరారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే సామాన్యుడు కష్టపడే రోజులు ఇక ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్ర, కార్యదర్శులు, మండల అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com