ఏలూరులో ఇళ్ళు దగ్ధమై నిరాశ్రయులైన కుటుంబానికి జనసేన ఆర్థిక సహాయం
ఏలూరు నగరం శాంతినగర్ ఏడవ లైన్ లో మొన్న దీపావళి రోజున తారాజువ్వల మూలంగా తళ్లూరి కృష్ణమోహన్ అనే వ్యక్తి యొక్క ఇల్లు కాలిపోయి నిరాశ్రయులు కావటంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆ వ్యక్తిని పరామర్శించి అతనికి ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు జనసేన పార్టీ ఏలూరు ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు గారి చేతుల మీదగా ఇవ్వడం జరిగింది. నిరాశ్రయులైన బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని, ఇల్లు కట్టుకోడానికి హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా అవకాశం కల్పించాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, వీర మహిళ తేజస్విని, సరిది రాజేష్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.